కడప నగరంలో హోటల్, రెస్టారెంట్ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత సూచించారు. కడప నగరంలోని మురళి హాల్ సమీపంలోని సౌజన్య హోటల్ లో ఆహార నాణ్యత బాగోలేదని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు మధ్యాహ్నం సిబ్బంది తో కలిసి ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత ఆకస్మికంగా సౌజన్య హోటల్ లో తనిఖీలు నిర్వహించారు. హోటల్ లోని భవన సామర్థ్యం, ఆహార తయారీ నియమాలు, కస్టమర్లకు అందిస్తున్న సేవలపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బిల్డింగ్ ప్రమాణాలు బాగోలేకపోవడం, శుభ్రత లోపించడం పట్ల నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. 15 రోజుల లోపు సరిచేసుకోకపోతే చర్యలు తప్పవని నోటీసులు అందజేశారు.