గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మాజీ మంత్రి కారుమూరి చేసిన అవినీతి, అక్రమాలను నియోజకవర్గ ప్రజలు ఇంకా మరిచిపోలేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో వ్యాపారాల నుంచి దోచుకున్న దోపిడీ ప్రజలకు ఇంకా గుర్తు ఉందన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. యూరియా కొరత లేనప్పటికీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.