కడప నగరంలోని కొత్త బస్టాండ్లో మందుబాబుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అతిగా మద్యం తాగి మద్యం మత్తులో కేకలు వేస్తూ నానా రభస సృష్టిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆయా ప్లాట్ ఫారం వద్ద మందుబాబులు పడిపోయి ఉండటంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు వృద్ధులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మందుబాబుల చేష్టల వల్ల కొందరు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి మందుబాబులు ఆగడాలు కట్టించాలని ప్రయాణికులు కోరుతున్నారు.