కెసిఆర్ పై సిబిఐ అక్రమ కేసులు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ కాసాల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బి ఆర్ ఎస్ శ్రేణులు మంగళవారం భారీ ధర్నా రాస్తారో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ మోసం, అక్రమ కేసులు పెట్టడం కు నిలయంగా మారిందని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో కెసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఆంధ్రకు తరలిస్తుందని ఆరోపించారు. అక్రమ కేసును కొట్టివేయాలని కాలేశ్వరం మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.