కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న (NHM ) ఉద్యోగులు 2నెలలుగా వేతనాలు అందడం లేదని గురువారం DM&HO డా. చంద్రశేఖర్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న తాము వేతనాలు ప్రతి నెల రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పెండింగ్ లో ఉన్న వెతనాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.