విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని, స్కూల్ రద్దు చేయాలని కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని RSF రాష్ట్ర అధ్యక్షులు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. DEO కార్యాలయం ఎదుట RSF ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం విజ్ఞాన్ స్కూల్ బస్సు రైల్వే బ్రిడ్జ్ వద్ద బోల్తా పడింది, దీనిలో 45 మంది పిల్లలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం బస్సు రోడ్డు మార్గం దాటుకొని బ్రిడ్జ్ కల్వర్టు పైకి దూసుకుపోయి రైల్వే ట్రాక్ మీదకు పడేంతగా వేలాదిందంటే డ్రైవర్ నిర్లక్ష్యమేనన్నారు.