నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దేవరకొండ డిప్యూటీ డిఎంహెచ్వో కేస రవితో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ తో పాటు వార్డులను పరిశీలించి, మండల వైద్యాధికారి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిడిఆర్ కేసుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలను అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.