Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
కందుకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్లో మంగళవారం ఆధునిక సాంకేతికతతో రూపొందించిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన MLA ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ హిమవంశి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం పారదర్శక పాలన కోసం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల విధానం ప్రజలకు మరింత సౌలభ్యం కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగింది.