సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ మహేష్ బి. గీతే తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అవసరమైన మేరా క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయడమే ల