నల్గొండ జిల్లా, వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధమయ్యాయి. మధ్యాహ్నం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు కు చెందిన భయ్యా సైదులు అనే రైతు గ్రామ శివారులోని బండమీద గడ్డివాము ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం గడ్డివాము నుండి మంటలు ఏర్పడి, దట్టమైన పొగలు అలముకున్నాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.