హనుమకొండ జిల్లాలోని హనుమకొండ నగరంలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఆదివారం అనుమతి లేకుండా విద్యార్థులను ఖైదీల బంధించి తరగతులు నిర్వహిస్తుందని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో కళాశాల ముందు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాకేష్ యాదవ్ మాట్లాడుతూ విద్యాశాఖ అనుమతి లేకుండా ఆల్ఫోర్స్ కళాశాలలో సెలవు దినాల్లో తరగతులను నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. అనుమతులు ఏమని ప్రశ్నిస్తే పోలీసుల అనుమతి ఉందని బుకాయించే ప్రయత్నం యాజమాన్యం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.