బీసీ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం శుభపరిణామం అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేసి, శాసనసభలో బీసీ రిజర్వేషన్ ఆమోదం పొందిందని తెలిపారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయి పంచిపెట్టారు.