అనమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం ఎల్కతుర్తి చింతలపల్లి గ్రామాల్లో ఈనెల ఏప్రిల్ 27వ తారీకు జరిగే రజతోత్సవ టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలిరానున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అను అన్నారు.