కావలి రైల్వే స్టేషన్ సమీపంలో పూరీ ఎక్స్ప్రెస్ రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వద్ద చెన్నై నుంచి ఒంగోలు వెళ్లే టికెట్ ఉందన్నారు. మృతుడు తెలుపు రంగు అరచేతుల చొక్కా, గ్రీన్ కలర్ లుంగీ, పచ్చ ఎరుపు గీతల బులుగు నిక్కర్ ధరించాడన్నారు. ఆయన వయస్సు 55-60 మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు.ఈ ఘటన మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది.