ఎమ్మిగనూరు డీఎస్పీగా భార్గవి ..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు డీఎస్పీగా భార్గవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో టెక్కలిలో పనిచేసిన ఆమె, బదిలీపై ఎమ్మిగనూరుకు వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ ఉపేంద్రబాబు కర్నూలు దిశ పోలీసు స్టేషన్ కు బదిలీపై వెళ్లారు. ఇక బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీగా భార్గవికి పలువురు అభినందనలు తెలిపారు.