అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామం వద్ద శుక్రవారం ఉదయం 8:30 సమయంలో రాయదుర్గం నుండి నక్కలపల్లి బెలుగుప్ప మీదుగా అనంతపురం వెళ్లే ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కండక్టర్ రమేష్ కు కనుబొమ్మ, చెవి వద్ద తీవ్ర రక్త గాయాలు కాగా డ్రైవర్ అంజి కి స్వల్ప గాయాలు అయ్యాయి. నక్కలపల్లి కి చెందిన ప్రయాణికురాలు వృద్ధురాలు సుంకమ్మ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులకు బెలుగుప్ప పిహెచ్సిలో చికిత్సలు అందించి మెరుగైన చికిత్సలకు అనంతపురం తరలించారు.