సత్య సాయి జిల్లా హిందూపురం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 252 టెట్రా పాకెట్ల కర్ణాటక మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. ఈ దాడులలోడీటీఎఫ్ ఎస్ఐ, సింహ, ఎస్ఐలు పృథ్వి, ఫరూక్, నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ నరసింహ,వెంకటేష్, రమణ,సతీష్, కానిస్టేబుల్స్ అంజి, రవీంద్ర, కుమార్, రంగదామా, శివ, సుధాకర్ రెడ్డి, ఉష్మాన్ మరియు విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.