అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల తండా గ్రామంలో మంగళవారం స్థానిక పిహెచ్సి వైద్యాధికారుల పావని, వెంకటేష్ నాయకుల ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. గ్రామంలోని కాలనీలలోను, బురద కాలువల పైన క్రిమిసంహారక మందులు మలాథియాన్లను పిచికారి చేయించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు డ్రైడే పాటించాలని, దోమతెరలను ప్రతి ఇంట తప్పకుండా వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు.