ఇంజన్ లో సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్ నుండి ఎర్నాకులం వెళ్లే శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి బాపట్ల రైల్వే స్టేషన్ లో గంటకు పైగా నిలిచిపోయింది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.కాగా అప్పటికప్పుడు మరమ్మతులు సాధ్యం కాకపోవడంతో వేరే ఇంజన్ రప్పించి రైలును పంపారు. సాంకేతిక నిపుణులు ఇంజన్ లో తలెత్తిన సమస్యను అధ్యయనం చేస్తారని రైల్వే అధికారులు చెప్పారు.