మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురువారం సాయంత్రం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని వరుసుగా అందుతున్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది సరైన వైద్య శిఖ్యతలు అందించడం లేదని తీరు మార్చుకొని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.