అమరాపురం మండలంలో జూద కేంద్రంపై ఎస్సై ఇషాక్ బాషా సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు చేశారు. ఎస్సై ఇషాక్ బాషా మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం రావడంతో మండల కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్న కేంద్రంపై దాడి చేసి పదిమందిని అరెస్టు చేశామని మరో పదిమంది పారిపోయారని తెలిపాడు.వీరి నుండి రూ.18130 డబ్బులు 5 వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.