కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది శ్రీకాంత్ పై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ఉదయం లక్షెట్టిపేట పట్టణంలోని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి శ్రీకాంత్ కు సంఘీభావం తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.