ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం చిన్న కనుమల్ల గ్రామ సమీపంలో బొలెరో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అందించి తర్వాత 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో వివరాలు తెలియలేదని విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ అన్నారు.