*గోళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి* అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండలం గోళ్ళపల్లి వద్ద ఇన్నోవా కారు బోల్తాపడి శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మదనపల్లికి చెందిన శ్రీనివాసులు, సాయి గా గుర్తింపు, బాధితుల్ని కురబలకోట 108 మస్తాన్, బావజాన్ లు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.