కుండపోత వర్షంతో అదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం అతలకుతలమైంది.. కురిసిన వర్షంతో వాగులు వంకలు అన్ని ఉప్పొంగి ప్రవహించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి..నేరడిగొండ మండల కేంద్రంలో పలు కాలనీలు నీటమునగగా, బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వరద తాకిడి ప్రాంతాలను సందర్శించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి నీట మునిగిన పంటలకు నష్టపరిహారం అందించడంతోపాటు, ఇల్లు కోల్పోయిన వారికి పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు