సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి లోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సోసైటీ గురుకుల పాఠశాల కళాశాలలో పాత డార్మెటరీ బ్లాక్ కూలిన భావన ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. ఎస్డిఆర్ ఆఫ్ బృందం చేపట్టిన సహాయక కార్యక్రమాలపై సమీక్ష జరిపి శిధిలాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాత్కాలిక ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.