కడప నగరంలోని 26వ డివిజన్ ఆకుల వీధిలో వినాయకుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. శ్రీరాముల వారి వీధి వెనుక ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో వర్షం కారణంగా మురికి కాలువలు నిండిపోయి మండపంలోకి నీళ్లు వచ్చాయి. దీంతో గమనించిన వినాయక కమిటీ సభ్యులు వెంటనే శానిటేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన వారు మురికి నీటిని సహజంగా పారెందుకు చర్యలు తీసుకున్నారు.