కరీంనగర్ ఎంపీ,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు ఆదివారం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర జనహిత పాదయాత్ర లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచే వారే కాదని ఆరోపించారు. దొంగ ఓట్లు లేకపోతే కార్పొరేటర్ నుంచి ఎంపీ దాకా ఎలా గెలిచారు అని అన్నారు.దొంగ ఓట్లతోనే రాష్ట్రంలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలు గెలిచారని అన్నారు. బీసీల గురించి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీ బిల్లు పై మాట్లాడకుండా ముఖం చాటేసారని,బండి సంజయ్ బీసీ బీసీ కాదని ఒక దేశ్‌ముఖ్ అని అన్నారు.