అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో రూరల్ డిఎస్పి కార్యాలయంలో శనివారం ఒంటిగంట యాభై నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిన్నటి రోజున బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గణేష్ నిమజ్జనంలలో హరీష్ అనే కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించి యువకులను కొట్టాడని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఎవరిని కొట్టలేదని ఎవరు సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలను వెల్లడించారు.