యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల పరిధిలోని మాసాన్ పల్లి గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన కుటుంబంతో కలిసి దళితుల ఇంటిలో సన్న బియ్యంతో సహాపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. సంపన్నులతో సమానంగా పేదలు కడుపునిండా సన్న బియ్యంతో భోజనం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.