రాజన్న సిరిసిల్ల,జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో, మండలంలోని వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు శనివారం 4:20 PM కి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అక్నపల్లి కరుణాకర్ మాట్లాడుతూ, పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజనుకు వినతి పత్రం ఇచ్చేందుకు మాజీ సర్పంచ్లకు అవకాశం కల్పించాలన్నా రు,గత ప్రభుత్వంలో అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ అప్పులు చేశామని ఇప్పటికి బిల్లులు మంజూరు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు,