రెంజల్ మండలంలోని సాఠాపూర్ గ్రామంలోని రైతు వేదికలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాళ నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు హాజరు కాగా,సీఐ విజయబాబు, ఎంపీడీవో కమలాకర్ వారికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలతో పాటు మిలాద్ ఉన్ నబి పండుగ కలిసి రావడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు కుల, మత విభేదాలు లేకుండా శాంత వాతావరణం లో వేడుకలు జరుపుకోవాలని కోరారు. గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.