ధర్మవరం మండలం ఓబులనాయన పల్లి గ్రామంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. సరస్వతి అనే (55) మహిళా రైతు తన పొలంలో కలుపుతీస్తుండగా విషపురుగు కొట్టి అపస్మానక స్థితిలోకి వెళ్ళింది కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సరస్వతి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. సరస్వతి కుటుంబం వ్యవసాయం చేస్తుంటారని ఒక కొడుకు కూతురు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.