సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఆదివారం 5వ, రోజు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, మహిళలు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. .