కరీంనగర్ రూరల్ మండలం నగునూరు దుర్గామాత ఆలయానికి వెళ్లే రోడ్డు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆదివారం తెలిపారు. దుర్గామాత ఆలయానికి వెళ్లే దారిని పరిశీలించి, రెండు వైపులా రోడ్డు కనెక్టివిటీ సమస్య ఉందని, స్థానిక స్థల యజమానులతో,ఆర్డీవో ఇతర ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని స్థానిక నగునూరు గ్రామస్తులకు, దుర్గామాత ఆలయానికి వచ్చే భక్తులకు హామీ ఇచ్చారు. తీగల గుట్టపల్లి ఆరేపెల్లి,రాణిపూర్ నుంచి రోడ్డు సమస్య ఉందని, త్వరలోనే పరిష్కారం చూపెట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు.