వినాయక శోభా యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు అమలు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఇతర మతాల పవిత్ర స్థలాలు, గుడులపై రంగులు (గులాల్) పడకుండా ఎత్తైన బారికేట్లు ఏర్పాటు చేయాలని, చెరువులు, కుంటల వద్ద భద్రతా చర్యలలో భాగంగా క్రేన్లు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. పటాన్ చెరు సాకి చెరువు వద్ద ఆయన ఏర్పాట్లును పరిశీలించారు.