ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. అర్వపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ కాలువలకు మరమ్మతులు చేసి సూర్యాపేట జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.