అశ్వారావుపేట లో బి ఆర్ యస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు రోడ్డు పై భైఠాయించి ధర్నా చేపట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో అక్రమాలు జరిగిందంటూ సీఎం రేవంత్ సీబీఐ విచారణ కు ఆదేశించడం దుర్మార్గమని,రాజకీయ కక్షతోనే కేసీఆర్ కి అవినీతి మరకలు అంటించి లబ్ది పొందాలనే మోసపూరిత ఆలోచనతో సిబిఐ ని తెస్తున్నారని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆరోపించారు.