ఇజ్రాయిల్ తో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ వ్యతిరేకిస్తుందనీ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ తెలిపారు. నగరంలోని ద్వారక నగర్ IFTU కార్యాలయంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించాము. ఈ సభలో శ్రీధర్ మాట్లాడుతూ.. నరహంతక ఇజ్రాయిల్ దేశ ఆర్థిక మంత్రి బేజాలేల్ స్మొట్రిక్ భారత పర్యటనకు ప్రభుత్వం ఆహ్వానించడం విచారకరమని శ్రీధర్ అన్నారు. పాలస్తిన దేశ ప్రజలపై అమెరికా సామ్రాజ్యవాదం అండదండలతో ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దుర్మార్గపు దాడుల వలన పాలస్తీనా వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.