ఖైరతాబాద్ లో కార్యాలయంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ రేపు జరిగే 46వ అనంత చతుర్దశి సామూహిక గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు. దాదాపు 303 కిలోమీటర్ల మేర రహదారులు కాసేయం రంగుతో అలంకరించినట్లు తెలిపారు. 34 చెరువులు 64 ప్రాంతాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు జరిగాయని ఆయన అన్నారు. 40 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.