రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆదిలాబాద్లో రోజుకో రీతిలో తమ నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు బతుకమ్మలతో నిరసన తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్దగల దీక్ష శిబిరం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.