శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఔన్నత్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత జాతీయ సేవా పథకం వాలంటీర్లు మీదే ఆధారపడి ఉందని ఎస్కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బి అనిత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో జాతీయ అంతర్జాతీయ శిబిరాల్లో విజేతలైన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు విసి చాంబర్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిల్లో సైతం తమ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు రాణించడం ప్రశంసనీయమన్నారు. కర్ణాటకలోని మంగళూరులో రెండు రోజులపాటు జరిగిన ఐకాన్ అంతర్జాతీయ శిబిరంలో పాల్గొని మూడు ఈవెంట్లలో విజేతగా నిలిచారు.