అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామపంచాయతీ నందు ఉన్న చెత్తతో సంపద సృష్టి కేంద్రాలకు పంపిణీ చేసిన మిషన్ల అకాడమిక్ మేనేజ్మెంట్ సిస్టం సెంట్రల్ టీమ్ నుండి అధికారులు మంగళవారం పరిశీలించారు. మిషన్ లకు సంబంధించి ఉరవకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ ని వివరాలు తెలపాలని సూచించారు. చెత్తతో సంపద సృష్టి కేంద్రాల వద్ద ప్రహరీ గోడలు విద్యుత్ సౌకర్యం లేనందు వల్ల పంచాయితీ కార్యాలయం వద్ద ఉంచడం జరిగిందని సెంట్రల్ టీమ్ అధికారులకు సెక్రెటరీ తెలిపారు. త్వరలోనే ప్రహరీ గోడను నిర్మించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి మిషన్ వినియోగంలోకి చేస్తామని పంచాయతీ కార్యదర్శి వివరించారు.