కేవీ పల్లి మండలంలో కేవీ పల్లి, వగళ్ళ గ్రామ పంచాయతీ లలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను అన్నమయ్య జిల్లా పథక సంచాలకులు వెంకట రత్నం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వగళ్ళ పంచాయతీ నందు లోకేశ్వర రైతు పొలంలో నాటుకున్న మామిడి మొక్కలను పరిశీలించారు.రైతుకు గిట్టుబాటు ధరలు రావాలంటే మంచి దిగుబడినిచ్చే హిమాంపసంద్, కేసర మరియు బెంగళూరు వంటి మంచి రకాలను ఎంపిక చేసుకొని,పెట్టుకోవాలని తెలిపారు. మొక్కల సంరక్షణకు ప్రభుత్వం నుండి 3 సం.రాలు నీళ్ళు పోయడానికి,దున్నుటకు,ఎరువులకు, అంతర పంటలకు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని తెలిపారు.