కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ టమోటో మార్కెట్లో శనివారం టమోటా ధర కుప్పకూలింది. దీంతో రైతులు ఆగ్రహించి మార్కెట్లోనే పారబోసి తొక్కేశారు. గత వారం కిలో 30 రూపాయలు పలికిన టమోటా ఒక్కసారిగా రూపాయికి కీలోపాకడంతో రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతులను ఆదుకోలంటూ రైతులు ఈ సందర్భంగా కోరారు.