గుంటూరు ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ మత్తి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం రూ.30,000/- రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.JBV పథకం కింద ఎస్సీ, ఎస్టీ లకు పెట్టుబడి సబ్సిడీ తిరిగి చెల్లింపు కోసం దాఖలు చేసిన దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు మండేపూడి కమలాకర్ రావు అనే వ్యక్తి వద్ద నుండి గుంటూరు ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ మత్తి శ్రీనివాసరావు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.30,000/- రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా గుంటూరు ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.