భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శిక్షణ తరగతులు బృందావన్ కన్వెన్షన్ హాల్ లో అన్ని గ్రామాల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు అందరికీ శిక్షణ కార్యక్రమము జరిగింది,ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు అర్ల మాధవరావు ఆద్యక్షతన జరిగింది,ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ కిసాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరంగారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనందరావు పాల్గొన్నారు. మండల కమిటీ మెంబర్లు,వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు కార్యకర్తలు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ కమిటీలు సమావేశాలు వారం వారం తప్పకుండా జరపాలని తెలిపారు.