సకల జీవరాసులకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా ద్వారకాతిరుమల క్షేత్రదేవత శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. దేవిశరన్నవరాత్రి వేడుకలలో భాగంగా మూడవరోజైన బుధవారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఒక చేతిలో అక్షయపాత్రను ఉంచుకొని మరో చేతిలో ఉన్న గరిటతో సాక్షాత్తు ఆ మహాశివునికి బిక్షం వేస్తున్నట్లు ఉన్న ఈ అలంకరణ భక్తులను పరవశింపజేసింది. అన్నపూర్ణ అలంకారంలో కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.