గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని, నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్ కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యో