మహనంది మండలం అంకిరెడ్డి చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అన్న సమాచారంతో, తెల్లవారుజామున పోలీసులు ముకుమ్మడిగా దాడి చేసి మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను సీట్ చేసి మహానంది పోలీస్ స్టేషన్ కు తరలించారు.వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలియజేశారు. గత కొద్దిరోజులుగా మహానంది మండలంలో ఆక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలతో పోలీసులు అక్రమ మట్టి రవాణా దారులపై, దాడులు చేశారు.